ఖిల్లాగణపురం మండలం సోలిపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం బాల్యవివాహాలు, బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రంలో జెండర్ స్పెషలిస్ట్స్ శ్రీవాణి, సలోమి, సుమ ఆధ్వర్యంలో బేటి బచావో-బేటి పడావోలో భాగంగా బడి ఈడు పిల్లల్ని బడికి పంపించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని 1098కు, మహిళా సమస్యలు 181కి, వయోవృద్ధుల సమస్యలు 14567 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని వివరించారు.