ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జేసీగా పనిచేసిన అనుభవం ఉందని, పల్నాడు ప్రాంతంపై తనకు ప్రత్యేక అవగాహన ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా వేదికలో వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.