ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామానికి చెందిన కుంపట్ల సత్యనారాయణ శనివారం జొన్నాడ వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన డీఎస్పీ ప్రదీప్తి ఆలమూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఎస్సై తన సిబ్బందితో కలిసి జాలర్ల సహాయంతో పడవపై వెళ్లి, గోదావరిలో కొట్టుకుపోతున్న సత్యనారాయణను రక్షించారు. అనంతరం అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు