నల్లగొండ పట్టణంలోని శుక్రవారం ఉదయం ఒకటవ నంబరు వినాయకుని వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి శుక్రవారం ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు వినాయకుని ఆశీస్సులు నల్లగొండ జిల్లా ప్రజలందరికీ ఉండాలన్నారు .ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వినాయకుని నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు అర్చకులు భక్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.