* జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్ గారి ఆద్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. లక్ష్మీనారాయణ గారు నిన్నటి దినం వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 11 మంది పట్టుబడ్డారు. వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టగా జడ్జ్ కుమారి ఉమా దేవి వాహనదారులకు 11 మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం 1,10,000/- రూ.లు జరిమానా విధించడం జరిగింది.