నంద్యాల జిల్లా ప్యాపిలి టమాటా మార్కెట్ను ఎస్సై మధుసూదన్ ఆదివారం సందర్శించారు. 10 బాక్సులకు గాను 8 బాక్సులకే వ్యాపారులు డబ్బులు చెల్లిస్తున్నారని, రూ. 100కు రూ.10 చొప్పున తగ్గించి ఇస్తున్నారని రైతులు ఎస్సైకి ఫిర్యాదు చేశారు. దీంతో వ్యాపారుల తీరుపై ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్కు సరుకు తీసుకొచ్చే రైతుల వ్యయప్రయాసలను వ్యాపారులు గుర్తించి, టమాటాను గిట్టుబాటు ధరతోనే కొనుగోలు చేయాలన్నారు.