తనపై టీడీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని నగరి మున్సిపాలిటీ 6వార్డు కౌన్సిలర్ సాయి సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు నగరిలోనే ఆధార్, ఓటర్, రేషన్, పాన్ కార్డులు ఉన్నాయని పుట్టి పెరిగింది నగరి దళితవాడలోనే అన్నారు. తాను ఇక్కడే ఓంటరిగాగా జీవిస్తున్నానని, తనను తమిళనాడు వాసిగా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదివారం వాపోయారు. సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించినట్లు ఆమె తెలిపారు.