శ్రీశైలంలో అటవీ సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని రైల్వే కోడూరు ఎఫ్ఆర్ఓ శ్యామ్ సుందర్ అన్నారు. ఈనెల 19 వ తేదీ రాత్రి శ్రీశైలం దగ్గర గల శిఖరం చెక్ పోస్ట్ నందు అటవీ సిబ్బంది పైన, స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే, అతని అనుచరులు దౌర్జన్యం చేసి, నానా దుర్భాషలాడి, భౌతిక దాడులకు దిగడాన్ని ఖండిస్తూ శుక్రవారం కోడూరు అటవీ శాఖ కార్యాలయం వద్ద కోడూరు బాలు పల్లె రేంజ్ సిబ్బంది నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు. బాధితులకు న్యాయం జరగాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.