విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కవితా దేవి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పెద్దలను గౌరవించాలన్నారు. జీవితంలో ఎదగడానికి విద్యార్థి దశ కీలకమైందని ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పలు చట్టాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, లీగల్ సర్వీసెస్ సిబ్బంది ఉన్నారు.