అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలో నాయన విగ్రహానికి ప్రతి నెల ఒకటో తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.