రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని సోమవారం పిఎసిఎస్ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన కు దిగారు. ఉదయం నుంచి క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా అందించడం లేదని గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని వాపోయారు. వెంటనే అధికారులు ప్రభుత్వ స్పందించి యూరియా కొరత తీర్చాలని పలువురు రైతుల డిమాండ్ చేశారు.