తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాల నిరోధక చట్టం చేయలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనం లో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రాలు, చేతబడుల పేరా అమాయకులపై దాడులు చేయడం, హత్యలు చేయడం చాల విచారకరం అని అన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్, కొండా రాములు, అనంత్ విశ్వేషర్, ప్రధాన కార్యదర్శి శేక్ రఫీక్,చెకుముకి కన్వీనర్ నారాయణ వర్మ, వట్టలి ముత్తన్న, పోలకొండా నారాయణ వర్మ, వెంకటరమణ పాల్గొన్నారు.