జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, కొమ్మరగుంట రైతు సేవ కేంద్రంలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన రెండు ప్రింటర్ల దొంగతనం కేసులో నిందితుడైన పచ్చికాపల్లం హరిజనవాడకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు మురళిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న మురళిని విచారించి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే శిక్ష తప్పదని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు హెచ్చరించారు.