వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక చవితి అనేది కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికీ క్షేమం, ధైర్యం, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని, చేపట్టిన పనుల్లో విజయం దక్కాలని ఉన్నారు