ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ఉదయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించి అంశాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఒకవైపు ఆటో డ్రైవర్లు మరోవైపు నిరుద్యోగులు పేదలకు వైద్యం అందించే వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తే పెదవులు ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.