స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని రేపు రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించనున్నట్టు ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. డాక్టర్ వామనమూర్తి సమన్వయకర్తగా నిర్వహించనున్న ఈ కార్యశాలకు మెదక్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ మల్లెగోడ గంగా ప్రసాద్ మరియు మెదక్ లోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్న డాక్టర్ పద్మరాణి అతిథులుగా రానున్నారు.