పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం తన ఛాంబరులో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టరేట్ కు చేరుకున్న ఆయనకు డీఆర్వో కె.హేమలత పుష్పగుచ్ఛం అందజేసారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం లోని పలు విభాగల పర్యవేక్షకులు, సిబ్బంది జేసీకి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా రెవిన్యూ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.