భీమ్గల్ మండల కేంద్రంలోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 శానిటేషన్ వర్కర్స్ కు మహిళా సంఘ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. పురపాలక శాఖ ఆదేశాల మేరకు వందరోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శానిటేషన్ వర్కర్స్ కు వైద్య పరీక్షలు డాక్టర్ అజయ్ పవర్ ఆధ్వర్యంలో నిర్వహించి ఉచితంగా మందులను అందజేసినట్లు తెలిపారు.