తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ రాయుడు ఎండి పై కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కొండేపూడి ప్రకాష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ రాయుడు ఎండి పై ఫిర్యాదును పిఠాపురం పట్టణ ఎస్సై మణికుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా కొండేపూడి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు .