ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయికి పీలేరు,కేవిపల్లి మండలాలకు చెందిన ముగ్గురు ప్రధాన ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం అన్నమయ్య జిల్లాలో ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా ఎన్నికలు రాయచోటి బాలికల ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర కౌన్సిలర్ గా పీలేరు మండలం జంగంపల్లికి చెందిన ప్రధానోపాధ్యాయులు తాటిపర్తి గంగాధర్ ఎన్నికయ్యారు.జిల్లా కోశాధికారిగా కేవిపల్లి మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయులు వై వెంకటరమణ ఎన్నికయ్యారు.రాయచోటి డివిజన్ కార్యదర్శిగా పీలేరు మండలం మేళ్ళ చెరువు ప్రధానోపాధ్యాయులు వై.సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు