ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామంలో శుక్రవారం మట్టి మిద్దె కూలిపోయింది. గ్రామానికి చెందిన అవులయన్న, ఆయన కుమారుడు రాజేష్ లు నివాసముంటున్న మట్టి మిద్దె భారీ వర్షాలకు కూలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తమను కనికరించి ఆర్థిక సాయం అందజేయాలని, ఇంటి స్థలాన్ని, బిల్డింగ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.