నిర్మల్లో కబ్జా భూములను కాపాడాలని ఆప్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కబ్జా భూములను కాపాడాలని, లేకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం సమర్పించారు.