Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలోని బాబాపేటలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం, సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం వాటిళ్లినట్లు బాధితుల ఆవేదన

Narasaraopet, Palnadu | Aug 26, 2025
నరసరావుపేట బాబాపేట 6వ వార్డులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పక్కింటి వారు పొగలు కనిపించగానే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. షేక్ మాబుసుభాని – ఫాతిమా దంపతులు టిఫిన్ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని, దాదాపు ₹4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. సర్వం కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని మాబుసుభాని దంపతులు వేడుకుంటున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us