కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువు పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వినాయక చవితి సందర్భంగా కలువ పూలు కోసం దిగాడు అని స్థానికులు తెలియజేస్తున్నారు కాలుజారి పడటంతో మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు, స్థానికులు దేహాన్ని బయటకు తీశారు.