ఏలూరు జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలు పిజిఆర్ యస్ కార్యక్రమానికి తమ సమస్యలను తెలియజేసేందుకు వచ్చిన దివ్యాంగులు వద్దకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్వయంగా దివ్యాంగులు చెంతకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసు కున్నారు. దివ్యాంగులు బొర్రా సుధాకరమ్మ, ఇద్దాబత్తుల ప్రసన్న,నక్కా రాము,యు.ప్రవీణ్ కుమారిలు మాకు నోటీసులు అందాయని, పెన్షన్లు ఆగుతాయని అంటున్నారని కలవటానికి వచ్చామని చెప్పారు. దీంతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్పందిస్తూ పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.