విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తులో మరింత మంచి నైపుణ్యాన్ని కనబర్చి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని, ప్రభుత్వం క్రీడల అభివృద్దికి కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. స్థానిక సర్ధార్ పటేట్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు.