సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ సమీపంలో గల శ్రీ గండిరామన్న అర్బన్ పార్క్ లో అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం గురువారం నిర్వహించారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ నాగిని భాను, నిర్మల్ రేంజ్ ఆఫీసర్ జీవీ రామకృష్ణారావు, మామడ రేంజ్ ఆఫీసర్ అవినాష్, ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ అనిత, బైంసా రేంజ్ ఆఫీసర్ రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.