డంపింగ్ యార్డ్ నుండి కొండపేట కి వెళ్లే రహదారిలో బిల్డింగ్ వేస్ట్ ను డంప్ చేస్తున్న లారీ ని స్థానిక ప్రజలు అడ్డగించారు. అనధికారికంగా వేస్ట్ ను కాలనీ రహదారిలో అడ్డంగా వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు తెలిపారు. ఆలా వేయటంతో ఈ రహదారిని మరో డంపింగ్ యార్డ్ గా మారుస్తున్నారని అన్నారు. దీంతో ఈ మట్టి రోడ్డులో ప్రయాణం చేసేవారు చాలా ప్రమాదాలకు గురవతున్నారని వాపోయారు. అదికారులు ఇలా రహదారులపై వేస్ట్ ను డంప్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.