అమలాపురం స్థానిక కలెక్టరేట్ నందు దసరా ఉత్సవాల నిర్వహణ సన్నద్ధత అంశాలపై జిల్లా డివిజన్ స్థాయి పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దేవాదాయశాఖ అధికారులు ఉత్సవ కమిటీ పెద్దలతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలను అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఈనెల 26న మరలా పూర్తిస్థాయి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.