కర్నూలు నగరంలో ముస్లింలు శుక్రవారం ఉదయం 10 గంటలకు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మసీదుల్లో ప్రత్యేక నమాజ్లు, ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని కిడ్స్ వరల్డ్ నుండి రాజ్ వీహర్ సెంటర్ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. శాంతి, దయ, కరుణ, ఐక్యత వంటి గొప్ప విలువలను ప్రవక్త ముహమ్మద్ భోదించారని ఆయన పుట్టిన రోజు ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంద్నారు.