తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డప్పు చప్పుళ్ల నడుమ స్టెప్పులేశారు. 78 ఏళ్లు వయసులోనూ అందరినీ ఉత్సాహపరిచారు. ఆదివారం రాత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన మాస శివరాత్రి ప్రాకారోత్సవ కార్యక్రమాలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయంలో ఊరేగించారు స్వామివారికి ఊరేగింపులు చేసే ప్రభాకర్ రెడ్డి స్టెప్పులు వేశారు