కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాలు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. బిజెపి పార్టీ బీసీ బిల్లును అడ్డుకుంటుందన్నారు. దేవుండ్ల పేరుతో బిజెపి పార్టీ ఓట్లను అడుగుతుందన్నారు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు.