గంట్యాడ మండలం రామవరం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పొలం పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా యూరియా పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని గంట్యాడ మండల వ్యవసాయాధికారి బి శ్యాం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇన్చార్జ్ ఎంపీడీవో రాములమ్మ మాట్లాడుతూ, నానో ఎరువుల వినియోగానికి రైతులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గంట్యాడ మండల వ్యవసాయ అధికారి శ్యాంకుమార్ మాట్లాడుతూ, ఈ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు ఎవరు యూరియా కోసం ఆందోళన పడవద్దని సూచించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.