Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు వైయస్సార్ : ఎమ్మెల్యే శ్రీ గణేష్

Himayatnagar, Hyderabad | Sep 2, 2025
కంటోన్మెంట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడికి ధైర్యం ఇచ్చిన ప్రజానాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. జనహృదయనేతగా తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని తెలిపారు. పేదలకు ప్రాణదాతగా వైయస్సార్ నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us