యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 62 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ నాయకులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమును ఆహ్వానించలేదని శిలాఫలకం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డిజి కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని నినాదాలను చేపట్టారు.