ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు వాగులు వంకల దగ్గర నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకి ఎవరు కూడా రావద్దని సూచించారు .వర్షంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.