రాజీమార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్అదాలత్ సహకరిస్తుందని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నూతక్కిఅన్నారు. భీమడోలు న్యాయస్థానం ఆవరణలో శనివారం లోక్అదాలత్ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదయిన 75కేసులను సాయంత్రం 4గంటలు వరకు రాజీమార్గంలో పరిష్కారం చేసారు. ఈమేరకు 53క్రిమినల్ కేసులు, 10సివిల్ కేసులు, 5ఎంసీ, డీవీసీ కేసులు అదేవిధంగా 7 చెక్కులకు సంబంధించి కేసులు రాజీ చేసినట్లు అధికారులు తెలిపారు.