శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నుంచి శుక్రవారం స్వామివారి భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి ఆలయం వద్ద నుంచి కుమ్మరవాండ్లపల్లి లోని కొండల రాయుడు ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గిరిప్రదక్షిణ చేయడానికి అధికారులు స్పందించి మార్గం ఏర్పాటు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.