విజయనగరంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ లో అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా డైట్ చాత్రోపాధ్యాయులకు అందరికీ విద్య నూరు శాతం అక్షరాస్యత అంశంపై వక్తృత్వ పోటీ బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు మాట్లాడుతూ, ప్రతి ఛాత్రోపాధ్యాయుడు కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాసులుగా మార్చే బాధ్యత తీసుకోవాలన్నారు. వయోజన విద్య జిల్లా నోడల్ అధికారి వేణుగోపాల్, స్టాఫ్ సెక్రటరీ వాక చిన్నం నాయుడు ప్రసంగించారు. వైస్ ప్రిన్సిపాల్ అప్పలనాయుడు సూపరింటెండెంట్ కమల కుమారి, సీనియర్ లెక్చరర్ ఎం రమేష్ ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు.