గజపతినగరం పట్టణంలోని వినాయక గుడి జంక్షన్ లలోని పలు షాపులలో చోరీకి పాల్పడిన గజపతినగరం చెందిన గ్రంధి హరి శంకర్ ను అరెస్ట్ చేసినట్లు సోమవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి ఏ వి రమణ తెలిపారు. గజపతినగరంలోని పలు షాపులలో 14 వేల రూపాయలు చోరీ అయిందని చెప్పారు. చోరీకి పాల్పడిన గ్రంధి హరి శంకర్ ను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో గజపతినగరం ఎస్ ఐ కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.