ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్య వేడుకల సందడి మొదలైంది. సంవత్సర కాలం పాటు వ్యవసాయంలో రైతన్నలకు అండగా నిలిచే ఎడ్లను పూజించే పొలాల అమావాస్య పండుగ కోసం రైతన్నలు తమకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయడంలో బిజీ అయ్యారు. మంగళవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆదిలాబాద్లోని ప్రధాన కూడళ్లలో పొలాల సందడి నెలకొంది. ఎడ్లను ముస్తాబు చేసేందుకు వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు.