ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లోని ఓ టీవీ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ ఖలీల్ శుక్రవారం గుండెపోటు గురయ్యారు. వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలో అబ్దుల్ ఖలీల్ రిపోర్టర్ గా ఎంతో చురుకుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.