ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి బస్సు షెల్టర్ వద్ద ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీ అనే వికలాంగ వృద్ధురాలిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. నెల రోజుల నుండి ఆ వృద్ధురాలు రోడ్డును పోయే వారిని అందించే ఆహారం తీసుకుంటూ నడవలేని స్థితిలో నిర్జీవంగా ఉండడంతో గమనించిన ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ వెంటనే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ తెలియజేసి వారి సహకారంతో కొమరోలు లోని దీపు అనాధ వృద్ధుల ఆశ్రమంలో చేర్పించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను ఈ విధంగా రోడ్డుపాలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.