శ్రీకాకుళం నగరంలోని పోస్టల్ డివిజన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు మరియు శారీరక కార్యకలాపాల ప్రాధాన్యతను పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు వివరించారు. జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29 నుండి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో “ప్రతిరోజు ఒక గంట మైదానంలో ఆడండి” అనే థీమ్‌తో ఫిట్ ఇండియా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా ఫిట్నెస్ ప్రతిజ్ఞ, విద్యార్థులతో చర్చలు వంటి కార్యక్రమాలు చేపట్టిన తపాలా శాఖ ఆదివారం సాయంత్రంతో ముగించారు..