మల్కాజిగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నారపల్లి ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు డిటిఎఫ్ టీం ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 31 గ్రాముల ఎండిఎంఈ డ్రగ్స్ పట్టు పడ్డాయని పోలీసులు తెలిపారు. దీని విలువ 1.5లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మూడు సెల్ ఫోన్లు,ఒక బైకు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. డానియల్ రాజు, అభిరామ్,అభిషేక్ వర్మ అనే వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.