రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాలు కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్లందర్నీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా లో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సింహాచలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సి వెంటనే ప్రకటించాలని పెరిగిపోయిన నిత్యవసరాలు ధరలు కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని, కార్మికుల వేతనాలు పెంచాల డిమాండ్ చేశారు.