ఆస్పరి మండల కేంద్రంలో ఉల్లి పంట వేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఏఐటియుసి ఆస్పరి మండల తాలూకా అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశామని అన్నారు.