మేడ్చల్ జిల్లా చీరాల గ్రామంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న నవీన్ రామ్ రెడ్డి మంగళవారం కాలేజీకి హాజరై, తన క్యాబిన్ డోర్ తెరుస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కాలేజీ ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి.