నల్లగొండ పట్టణంలోని ఒకటవ నెంబర్ విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుండగా బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అడ్డుకున్నాడు దీంతో నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు .ఈ సందర్భంగా శుక్రవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను విడుదల చేయాలని ఒకటో నెంబర్ విగ్రహం వద్ద బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. అప్రజాస్వామి కంగా నల్లగొండ నియోజక వర్గంలో ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలిపారు.