హాలహర్వి మండలం కేంద్రం ఛత్రగుడి వద్ద లారీ బోల్తా పడింది. శనివారం బళ్లారి నుంచి కర్నూలు వైపుగా పత్తి గింజలతో వెళ్తున్న లారీ గుంతలు తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న హాలహర్వి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని కంట్రోల్ చేశారు.